అమెరికాలో మరోసారి కాల్పుల మోత

AMERICAఅమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. మేరీల్యాండ్ లోని ది క్యాపిటల్ న్యూస్ పేపర్ కార్యాలయంలోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడి కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా… పలువురు గాయపడ్డారు. అన్నాపోలీస్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. న్యూస్ పేపర్ కార్యాలయంలోని ఉద్యోగులను ఎందుకు లక్ష్యం చేసుకున్నారో వివరాలు తెలియదన్నారు యూఎస్ పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates