అమెరికాలో మాత్రమే: వీకెండ్స్ లో మహానటి ఫ్రీ షో

mahanati-freeతెలుగులో తొలి బ‌యోపిక్‌గా రూపొందిన  సినిమా మహానటి. ఈ మూవీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకోవ‌డ‌మే కాక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్ళు సాధిస్తుంది. చిన్న, పెద్ద తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రు ఈ సినిమాని ఆద‌రిస్తున్నారు. మ‌హాన‌టిలో సావిత్రి జీవితాన్ని క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్టు చూపించ‌డంతో ఆ త‌రం వారు మ‌హాన‌టి మూవీ చూసేందుకు థియేట‌ర్స్ ద‌గ్గ‌ర క్యూ క‌డుతున్నారు. ఇందులో 50 ఏళ్ళ‌కి పైబ‌డిన వ‌య‌స్సు వారు కూడా మండే ఎండ‌ల‌లో ఈ సినిమా చూసేందుకు థియేట‌ర్స్ ద‌గ్గ‌ర క్యూ క‌డుతున్నారు. అయితే ఈ విష‌యం తెలుసుకున్న వైజ‌యంతి మూవీస్ వారు 55 ఏళ్ల వయసు పైబడినవారికి శనివారం, ఆదివారం ‘మహానటి’ టిక్కెట్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. పెద్దల్ని గౌరవిస్తూ ఈ సౌక‌ర్యం కల్పిస్తున్నట్లు చెప్పింది. అమెరికాలోని కొన్ని లొకేషన్లకు మాత్రమే ఆఫర్‌ వర్తిస్తుందంటూ పోస్టర్‌లో తెలిపింది. మ‌రోవైపు వృద్ధాశ్రమాల్లో మ‌హాన‌టి చిత్రాన్ని ప్రత్యేక ప్రదర్శన నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది మ‌హాన‌టి టీం. జూన్ మూడో వారం మ‌హాన‌టి మీ ద‌గ్గ‌రికే రానుంది. ఇందుకు చేయ‌వ‌ల‌సింది మీ వివ‌రాలు vyjayanthimahanati@gmail.comకు వివరాలు పంపండి’ అంటూ  ట్వీట్ చేసింది మహానటి మూవీ టీం.

Posted in Uncategorized

Latest Updates