అమెరికా కాంగ్రెస్ లో జుకర్ బర్గ్ : తప్పు జరిగింది.. మన్నించండి

jkఅమెరికా కాంగ్రెస్‌ ఎదుట హాజరయ్యారు ఫేస్‌బుక్‌ సీఈవో జుకర్‌బర్గ్‌. డేటా దుర్వినియోగంపై జూకర్ బర్గ్ క్షమాపణలు చెప్పారు. ఫేస్‌బుక్‌ను తానే ప్రారంభించానని, తానే నిర్వహణ భాద్యతలు చూస్తున్నానని చెప్పారు. డెవలప్ చేసిన టెక్నాలజీ దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత తనపై ఉందని జూకర్ బర్గ్ తెలిపారు. తప్పుడు వార్తలకు సమాచారం వాడకుండా అడ్డుకోవడంలో విఫలమయ్యామన్నారు.

కేంబ్రిడ్జి అనలిటికా సంస్ధ యాప్‌ డెవలపర్‌ నుంచి సమాచారం పొందిందని, డేటా దుర్వినియోగంపై పూర్తిస్థాయి ఆడిట్‌ నిర్వహిస్తున్నామని జూకర్ బర్గ్ తెలిపారు. ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్లను వేల సంఖ్యలో తొలగించామని జుకర్‌బర్గ్‌ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు జూకర్ బర్గ్ సమాధానమిచ్చారు.

Posted in Uncategorized

Latest Updates