అమెరికా టూ హైదరాబాద్ : కారులో NRI దంపతుల సాహస యాత్ర

NRI AMERICA HYDఅమెరికా నుంచి కారులో హైదరాబాద్ చేరుకున్నారు ఓ NRI దంపతులు. రెండు నెలల సాహస యాత్రలో… 14 దేశాలను దాటి ఇక్కడికి వచ్చారు. ఈ ఏడాది మార్చి 28న న్యూయార్క్ లోని స్వామి ముక్తానంద ఆశ్రమం నుంచి ప్రయాణాన్ని ఆరంభించారు రాజేశ్, దర్శన. అక్కడి నుంచి తమ కారును విమానంలో పారిస్ కి పంపారు. ఏప్రిల్ 12న పారిస్ లో కారుని తీసుకొని అక్కడి నుంచి రోడ్డు ప్రయాణాన్ని మొదలు పెట్టారు. వేర్వేరు వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ  37వేల కిలోమీటర్లు ప్రయాణించారు. ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొని టూర్ పూర్తిచేశామని తెలిపారు రాజేష్, దర్శన దంపతులు.

Posted in Uncategorized

Latest Updates