అమెరికా డ్రగ్స్‌ కంట్రోల్ చీఫ్ గా భారతీయుడు

UTTAM-DHILLONభారతీయులు ప్రపంచ వ్యాప్తంగా తమ సత్తా  చాటుతున్నారు. అన్ని రంగాల్లోనూ కీలక పాత్ర వహిస్తున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాల్లోనే కాదు ఉన్నత పదవులను దక్కించుకుంటున్నారు. అమెరికా ప్రభుత్వంలో మరో భారత సంతతి న్యాయ వాదికి కీలక పదవి దక్కింది.  డ్రగ్స్ రవాణా, వాడకం కట్టడికి కృషి చేస్తున్న డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ న్యూ యాక్టింగ్‌ అడ్మినిస్ట్రేటర్‌గా ఇండో-అమెరికన్‌ ఉత్తమ్‌ ధిల్లాన్‌ ఎంపికయ్యారు. ఇటీవలే ఆ పదవి నుంచి విరమణ పొందిన రాబర్ట్‌ ప్యాటర్సన్‌ స్థానంలో ఆయన మంగళవారం(జులై-3) బాధ్యతలు చేపట్టారు.

ధిల్లాన్‌ వైట్ హౌజ్ లో అధ్యక్షుడు ట్రంప్‌కు డిప్యూటీ కౌన్సెల్, డిప్యూటీ అసిస్టెంట్‌గా పనిచేశారు. న్యాయ విభాగం, హోంల్యాండ్‌ సెక్యూరిటీ, కాంగ్రెస్‌లలో వేర్వేరు హోదాల్లో విధులు నిర్వర్తించారు. ఉన్నత స్థాయిలో డ్రగ్స్‌ అక్రమ రవాణాదారులకు వ్యతిరేకంగా వాదించారు. 2006లో డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ (DHS) లోని కౌంటర్‌ నార్కోటిక్స్‌ కార్యాలయానికి మొదటి డైరెక్టర్‌గా నియమితులయ్యారు ఉత్తమ్ ధిల్లాన్.

Posted in Uncategorized

Latest Updates