అమెరికా నుంచి… సెల్ ఫోన్ లో మూడుసార్లు తలాక్

వివాహ జీవితంలో వచ్చిన గొడవలను పరిష్కరించుకుందామని నమ్మించి భార్యకు వాట్సప్ లో మూడు సార్లు తలాక్ చెప్పాడు ఓ భర్త. దీంతో మహిళా పోలీసులకు భాదిత మహిళ ఫిర్యాదు చేసింది. బెంగళూరు కు చెందిన డాక్టర్‌ జావేద్‌ ఖాన్‌, రేష్మా అజీజ్‌లకు 2003లో పెళ్లయింది. మొదట వారు ఇంగ్లండ్ లో స్థిరపడగా ఈ మధ్యే వారి కుటుంబం అమెరికాకు షిప్ట్ అయింది. వారికి ఇద్దరు పిల్లలు. కూతురి వయసు 13.. కొడుకు వయసు 10.

భార్యా భర్తల మధ్య విభేదాలు తలేత్తడంతో బెంగళూరులో పెద్దల ఎదుట పరిష్కరించుకుందామంటూ భార్యను నమ్మించాడు జావేద్‌. నవంబర్ ‌30వ తేదీన వారు బెంగళూరుకు చేరుకున్నారు. విమానంలో ఉండగానే భార్య దగ్గర ఉన్న నగదును, బంగారాన్ని  జావేద్‌ తీసుకున్నాడు. వీటితో పాటే భార్య పాస్ పోర్టును కూడా తీసుకున్నాడు. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే ఇప్పుడే వస్తానంటూ చెప్పి భార్యను ఇంటికి పంపించి వేశాడు. ఎంతకీ తిరిగి రాకపోవడమే కాక ఈ నెల మొదటివారంలో భార్య మొబైల్ ఫోన్ కు మూడుసార్లు తలాక్ అంటూ టెక్ట్స్ మెసేజ్ తో పాటు వాయిస్ మెసేజ్ కూడా పంపాడు. రేష్మా ఇచ్చిన ఫిర్యాదు ను తీసుకున్న పోలీసులు కేసును నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates