అమెరికా రాయబారి నిక్కీహేలీ రాజీనామా

ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి పదవికి నిక్కీ హేలీ రాజీనామా చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆమె రాజీనామాకు ఆమోదం కూడా తెలిపినట్టు సమాచారం. ఇండియన్ అమెరికన్ అయిన నిక్కీ హేలీని 2016 నవంబర్‌లో ఐక్యరాజ్యసమితికి అమెరికా రాయబారిగా ట్రంప్ నియమించారు. ఈ పదోన్నతితో అమెరికా యంత్రాంగంలో కేబినెట్ స్థాయి పదవికి నియమితురాలైన మొదటి ఇండో అమెరికన్‌గా నిక్కీ పేరు మారుమోగింది.

Posted in Uncategorized

Latest Updates