అమెరికా రెస్టారెంట్ లో కాల్పులు… వరంగల్ విద్యార్ధి మృతి

americaఅమెరికాలో వరంగల్‌ చెందిన కొత్తవాడ వాసవీ కాలనీకి చెందిన విద్యార్థి శరత్ కొప్పు(26) పై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. కేన్సస్ సిటిలోని మూనివర్శిటీ ఆఫ్ మిస్సోరిలో ఎమ్మెస్ చేస్తున్న శరత్ ఫ్రెండ్స్ తో కలిసి శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో సిటీలోని ఓ రెస్టారెంట్ కు డిన్నర్ కి వెళ్లాడు. ఈ సమయంలో రెస్టారెంట్ కు వచ్చిన ఓ దుండగుడు అక్కడున్న వారిపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ సమయంలో అక్కడినుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన శరత్ పై దుండగుడు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న శరత్ ను ఫ్రెండ్స్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే శరత్ చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. శరత్ మృతితో వారి కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. వాసవీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పైర్తి చేసిన శరత్ హైటెక్ సిటీలోని సెగాసిస్టం వరల్డ్ వైడ్ కంపెనీలో కొంతకాలం జాబ్ చేశారు. అయితే ఉన్నత విద్య కోసం జనవరి-2018లో అమెరికా వెళ్లాడు శరత్. శరత్ పై కాల్పులు జరిపింది ఓ నల్లజాతీయుడిగా పోలీసులు గుర్తించారు. అనుమానితుడి వీడియో పుటేజీని విడుదల చేశారు. శరత్ భౌగికకాయాన్ని భారత్ కు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Posted in Uncategorized

Latest Updates