అమెరికా వీసాకి మరో అర్హత : సోషల్ మీడియా డీటెయిల్స్ ఉండాల్సిందే

v6వీసా కోసం అప్లయి చేసుకునేవారు తప్పనిసరిగా వారి సోషల్‌ మీడియా అకౌంట్ల వివరాలను ఇవ్వాలని కోరుతుంది అమెరికా ప్రభుత్వం. ఈ మేరకు ఫెడరల్‌ రిజిస్టర్‌ లో ఓ డాక్యుమెంట్‌ను పోస్టు చేసింది. గత ఐదేళ్లుగా వారు ఉపయోగిస్తున్న సోషల్ మీడియా అకౌంట్ల వివరాలతో పాటుగా వారు గతంలో వాడిన ఫోన్‌ నంబర్లు, ఈమెయిల్‌ ఐడీలు కూడా  సమర్పించాల్సి ఉంటుందని అమెరికా తెలిపింది. దేశ భద్రత కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ సర్కార్ తెలిపింది. ఈ  కొత్త నిబంధనలపై తమ స్పందన తెలియజేయాలంటూ ప్రజలను అధికారులు కోరారు. 60 రోజుల గడువును ఇందుకోసం పెట్టారు.

.

 

Posted in Uncategorized

Latest Updates