అమ్మడు దెబ్బకీ మళ్లీ ఫ్లాట్ : ఈసారి ముద్దును.. తుపాకీతో పేల్చింది

Oru-Adaar-Loveప్రియా ప్రకాష్ వారియర్.. ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయిన అమ్మాయి. ఫస్ట్ సినిమా కంప్లీట్ కాలేదు.. అప్పుడే ప్రపంచాన్నే ఊపేసింది. మొన్నటికి మొన్న కనుబొమ్మలతో కిరాక్ పుట్టిస్తే.. వాలెంటైన్స్ డే సందర్భంగా ముద్దుతో పడగొట్టేసింది ఈ అమ్మడు. ఒరు ఆదార్ లవ్ పేరుతో మళయాళంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెకండ్ టీజర్ రిలీజ్ చేసింది యూనిట్.

ఫస్ట్ సాంగ్ లో సైగలతో సంచలనం రేపితే.. ఈసారి అందుకు భిన్నంగా ఉంది టీజర్. క్లాస్ రూంలో హీరోకి.. హీరోయిన్ ఫ్లయింగ్ కిస్ ఇస్తోంది. పెదాలపై ముద్దును.. రెండు వేళ్లతో తీసుకుని.. తుపాకీలా హీరో గుండెలను పేల్చుతుంది. ఇది మామూలు ఐడియా కాదు అంటున్నారు నెటిజన్లు. దీంతో ఈ సినిమాపై హైప్ బాగా పెరిగిపోయింది. ఇంకెన్ని ఇంట్రస్టింగ్ సీన్స్ ఉంటాయో అని సినీ ఇండస్ట్రీ చర్చించుకుంటుంది. యూత్ కూడా బాగా కనెక్ట్ అవుతుండటంతో.. జస్ట్ గంటల్లోనే కొత్త టీజర్ సైతం లక్షల్లో దూసుకెళుతుంది.

 

Posted in Uncategorized

Latest Updates