అమ్మతోడు మీ జోలికి రాను: అల్లు కి వర్మ కౌంటర్

arivnd-ram-gopal-varmaమెగా నిర్మాత అల్లు అరవింద్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ. అరవింద్  గారు మీ మీద నాకు చాలా గౌరవముంది..ఎప్పటికీ ఉంటుంది..100% నేను  చేసింది  క్షమించరాని తప్పు..మళ్ళీ ఇంకొకసారి మీకు,పవన్ కళ్యాణ్ కి మీ కుటుంబ సభ్యులకీ  ఫాన్స్  కీ  అందరికీ  క్షమాపణ చెప్పుకుంటున్నాను.అంతే కాకుండా మళ్ళీ ఎప్పుడూ పవన్ మీద కానీ, మీ మిగతా ఫ్యామిలీ మెంబెర్స్ మీద కానీ నెగటివ్ కామెంట్స్ పెట్టనని మా మదర్ మీద, నా వృత్తి మీద ఒట్టేసి చెబుతున్నాను అని అన్నాడు.

పవన్ స్థాయి తగ్గిచడానికి నీ వెనుక ఎవరున్నారన్న అరవింద్ ప్రశ్నకు సమాధానమిచ్చాడు ఆర్జీవీ. పవన్ ఒక ఆకాశమంత ఎత్తున్న సూపర్ స్టార్ లీడర్..అతని స్థాయి తగ్గించడానికి ఆఫ్ట్రాల్  నేనెవరిని? మీరు నమ్మినా నమ్మకపోయినా కేవలం నా స్వభావం తప్ప నా  వెనుక ఎవరూ  కానీ, ఏ  పార్టీ లేదన్నాడు.

ఇండస్ట్రీ లో తల్లి పాలు తాగి రొమ్ము గుద్దాడంటూ అల్లు చేసిన ఆరోపణలపై  స్పందించిన ఆర్జీవీ..నా రొమ్ము నేను గుద్దుకున్నాను కానీ ఇంకెవరి రొమ్ము గుద్దలేదని కౌంటరిచ్చాడు.

Posted in Uncategorized

Latest Updates