అమ్మానాన్న గుర్తుకురాలేదా : సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. మంచి జీతం.. ఆత్మహత్య చేసుకున్నాడు

Suicideరోజురోజుకి యువకుల్లో ఓర్పు తగ్గిపోతుంది. లైట్ తీసుకునే నిబ్బరం లేకుండా పోతుంది. కారణం చిన్నదైనా.. పెద్దదైనా చావే పరిష్కారంగా చూస్తున్నారు. ముంబై నగరంలో మరో చరిత్ర మరవక ముందే.. భాగ్యనగరంలో విషాధ ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్, మంచి జీతం ఉండి కూడా ప్రేమ విఫలం అయ్యింది అంటూ దారుణంగా ప్రాణాలు తీసుకున్న ఘటన బండ్లగూడలో జరిగింది. ఈ యువకుడి తల్లిదండ్రుల ఆవేదన చూసేవారికి సైతం కన్నీళ్లు తెప్పించాయి. పూర్తి వివరాల్లోకి వెళితే…

హైదరాబాద్ బండ్లగూడకి చెందిన యతీష్.. విప్రో కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. మంచి జీతం. నాలుగేళ్లుగా ఓ అమ్మాయి ప్రేమలో ఉన్నాడు. ఇంట్లో వారికి కూడా చెప్పాడు. పెళ్లికి యతీష్ కుటుంబం కూడా ఓకే అన్నది. అయితే రెండు నెలల క్రితం అమ్మాయి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఈ విషయంపై నిలదీశాడు. పెళ్లికి ఇంట్లో వారు ఒప్పుకోవటం లేదని చెప్పింది ఆ అమ్మాయి. ఇంట్లో వారు చూపించిన సంబంధమే చేసుకుంటానని.. నా పెళ్లి నా చేతుల్లో లేదని చెప్పింది. అయితే నెల రోజుల క్రితం మరోసారి వీళ్లిద్దరూ మరోసారి కలిశారు. మాట్లాడుకున్నారు. ఈ సమయంలో మరో యువకుడి ప్రేమలో ఉన్నట్లు గుర్తించాడు. ఆ అబ్బాయితో వెళ్లటం చూశాడు. ఈ విషయంపై నిలదీశాడు. ఇంట్లో వాళ్లు చెప్పిన సంబంధం చేసుకునేటప్పుడు మరో అబ్బాయితో ఎలా తిరుగుతావ్.. నాలుగేళ్లుగా పెళ్లి చేసుకుంటానని చెప్పి ఎందుకు మోసం చేశావ్ అని అమ్మాయిని నిలదీశాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అమ్మాయి చేసిన మోసం.. అన్న మాటలతో మనోవేదనకు గురైన యతీష్.. బుధవారం రాత్రి.. ఉప్పల్ HMDA లే-ఔట్ దగ్గర చెట్టుకు ఉరి వేసుకుని మరీ చనిపోయాడు. ఎందుకు చనిపోతున్నది లేఖలో వివరంగా రాశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కొడుకు మరణం ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఎంతో కష్టపడి చదివించాం అని.. మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడని అనుకున్నాం.. ఇంత పని చేస్తాడు అనుకోలేదంటూ ఆ తల్లిదండ్రులు రోదన చూసేవారిని కన్నీళ్లు తెప్పించింది. అమ్మాయి కోసం చనిపోయే ముందు.. అమ్మానాన్న గుర్తుకు రాలేదా అంటూ ఆ తల్లి అనే మాటలకు అక్కడి వారు చలించిపోయారు. తొందరపడ్డావు రా బిడ్డా అంటూ ఆ పేరంట్స్ మాటలు అక్కడి వారిని కదిలించేశాయి.

Posted in Uncategorized

Latest Updates