అమ్మాయితో వల వేశారు : పాక్ ట్రాప్ లో పడిన ఎయిర్ ఫోర్స్ కెప్టెన్

arun-marwahaపాకిస్తాన్ గూఢచర్య సంస్థ ISI ట్రాప్ లో పడ్డాడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కెప్టెన్ అరుణ్ మార్వా. పాక్ కు చెందిన అమ్మాయితో రెగ్యులర్ టచ్ లో ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అమ్మాయి ద్వారా ISI హనీట్రాప్ చేసినట్లు స్పష్టం అయ్యింది. నైస్ గా మాట్లాడుతున్న ఈ అమ్మాయి వాట్సాప్ నెంబర్ కు… ఎయిర్ ఫోర్స్ కి చెందిన సమాచారం పంపించినట్లు గుర్తించారు. దీంతో గురువారం అర్థరాత్రి ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు.. ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ లో కెప్టెన్ మార్వాను అదుపులోకి తీసుకున్నారు.

కొన్ని నెలులుగా మార్వా కదలికలపై అనుమానం వచ్చింది. నిఘా పెట్టాయి భద్రతా దళాలు. ఓ అమ్మాయితో మాట్లాడుతున్నాడని.. రెగ్యులర్ టచ్ లో ఉన్నట్లు గుర్తించారు. ఎయిర్ ఫోర్స్ కు చెందిన వివరాలను కూడా షేర్ చేసుకుంటున్నాడు. నిఘా పెట్టిన పోలీసులు.. ఆమె పాకిస్తాన్ ISI హనీట్రాప్ గా గుర్తించారు. వెంటనే మార్వాను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఐదు రోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఎలాంటి సమాచారం ఇచ్చాడు.. ఏయే వివరాలు చెప్పాడు అనే విషయాలను రాబడుతున్నారు. మొదట ఈ అమ్మాయి ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యింది.

Posted in Uncategorized

Latest Updates