అమ్మాయిలు ఆక్కడ జీన్స్ వేసుకోవద్దు

JEENSఅమ్మాయిలు వేసుకునే డ్రైసింగ్ పై ఆంక్షలు విధించింది ఓ గ్రామం. గ్రామ కట్టుబాట్ల ప్రకారం అక్కడి యువతులు జీన్స్ వేసుకోవద్దని తీర్మానం చేసింది. ఈ ఘటన హర్యానాలో జరిగింది. సోనిపట్ జిల్లాలోని ఇసాయిపూర్ ఖేడీ గ్రామంలో అమ్మాయిలు జీన్స్ ధరించొద్దు.. స్మార్ట్ ఫోన్స్ వాడొద్దని గ్రామ సర్పంచ్ తో పాటు.. పెద్దలు తీర్మానం చేశారు. జీన్స్‌ను, మొబైల్ ఫోన్స్‌ను గ్రామంలో నిషేధించినట్లు గ్రామ సర్పంచ్ తీర్మానాన్ని ఆమోదించారు.

అయితే గ్రామ పెద్దల తీర్మానంపై ఓ అమ్మాయి తీవ్రంగా వ్యతిరేకించింది. అమ్మాయిలు జీన్స్ వేసుకుంటే తప్పేంటని ప్రశ్నించింది. తాము వేసుకునే బట్టలపై నిషేధం విధించడం తప్పని… పురుషుల మనస్తతత్వంతోనే సమస్య వస్తుందని తెలిపింది. వారు మంచిగా ప్రవర్తిస్తే తాము కూడా మంచిగానే ఉంటామని ఆమె స్పష్టం చేసింది. స్త్రీలు వేసుకునే బట్టలను బట్టి వారి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం సరికాదని తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates