అమ్మాయిలు బీర్లు సేవించడం ఆందోళనకరం

manohar-parrikar1గోవాలో అమ్మాయిలు బీర్లు సేవించడం ఆందోళన కలిగిస్తుందని ఆ రాష్ట్ర సీఎం మనోహర్ పారికర్ అన్నారు. శుక్రవారం (నిన్న) గోవాలో జరిగిన స్టేట్ యూత్ పార్లమెంట్‌లో మనోహర్ పారికర్ మాట్లాడుతూ అమ్మాయిలు బీర్లు సేవించడంతో భయమేస్తుందన్నారు. అమ్మాయిలందరూ బీర్లు సేవిస్తున్నారని తాను అనడం లేదు…కానీ రోజురోజుకు ఆ సంఖ్య పెరుగుతుందన్నారు పారికర్. గత రెండేళ్లలో బీర్లు తాగే అమ్మాయిల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందన్నారు గోవా సీఎం. గతేడాది ఆగస్టు నుంచి డ్రగ్స్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. డ్రగ్స్ దందా చేస్తోన్న 170 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల కోసం యువత బారులు తీరడం చూస్తే గోవా యువత హార్డ్ వర్క్ చేయడం లేదని స్పష్టంగా తెలుస్తోందన్నారు మనోహర్ పారికర్.

Posted in Uncategorized

Latest Updates