అమ్మాయిలూ అదరగొట్టారు : సాతాఫ్రికాపై ఇండియా విక్టరీ

indఉమెన్స్ క్రికెట్ లో భాగంగా మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసింది భారత్. సోమవారం (ఫిబ్రవరి-5) కింబర్లిలో జరిగిన ఫస్ట్ వన్డేలో భారత మహిళల జట్టు 88 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు చేసిన భారత్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 43.2 ఓవర్లలో 125 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్‌ వ్యాన్‌ నీకెర్క్‌ (88 బంతుల్లో 41; 2 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది.

ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ స్మృతి మంధన (98 బంతుల్లో 84; 8 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడైన ఇన్నింగ్స్‌తో జట్టు స్కోరులో కీలక పాత్ర పోషించింది. స్మృతి, కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (70 బంతుల్లో 45; 2 ఫోర్లు) కలసి రెండో వికెట్‌కు 99 పరుగులు జోడించారు. భారత సీనియర్‌ పేసర్‌ జులన్‌ గోస్వామి (4/24) అద్భుత ప్రదర్శనతో సఫారీల వెన్ను విరిచింది. శిఖాపాండేకు 3 వికెట్లు.. పూనమ్‌ యాదవ్‌కు 2 వికెట్లు దక్కాయి.  ఒకవైపు భారత పురుషుల క్రికెట్‌ జట్టు సౌతాఫ్రికాను వారి సొంతగడ్డపైనే ఓ ఆటాడిస్తుండగా… అదే దేశంలో మరో చోట మన మహిళల టీమ్‌ కూడా సఫారీల పని పట్టడం విశేషం.

Posted in Uncategorized

Latest Updates