అమ్మ బైక్ పథకాన్ని ప్రారంభించిన మోడీ

MODIతమిళనాడు దివంగత సీఎం జయలలిత పేరుతో మరో సంక్షేమ పథకానికి తమిళనాడు సర్కార్ శ్రీకారం చుట్టింది.శనివారం(ఫిబ్రవరి-24) చెన్నైలో పర్యటించిన ప్రధాని మోడీ.. జయలలిత జయంతి సందర్భంగా ‘అమ్మ టు వీలర్ స్కీం ను ప్రారంభించారు.

జయలలిత పెట్ ప్రాజెక్టులలో భాగంగా ప్రవేశపెట్టిన ఈ పథకం కింద ఉద్యోగం చేస్తున్న మహిళలందరికీ 50 శాతం సబ్సిడీ కింద  టూ వీలర్లను అందజేయనున్నారు. ‘టు వీలర్’ పథకాన్నిఎన్నికల మేనిఫెస్టోలో అమ్మ ప్రతిపాదించారని తెలిపారు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. అమ్మతో ప్రధాని మోడీకి చక్కటి సాన్నిహిత్యం ఉందన్నారు. అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని పరుగులు తీయించిన అమ్మకు గౌరవసూచికంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టామని సీఎం పళనిస్వామి తెలిపారు.

ప్రధాని ఆదివారం(ఫిబ్రవరి-25) పుదుచ్చేరిలో పర్యటిస్తారు. అక్కడి అరబిందో ఆశ్రమంలో అరబిందోకు నివాళులర్పించిన తర్వాత శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో విద్యార్థులతో భేటీ అవుతారు.

Posted in Uncategorized

Latest Updates