అయితే ఏంటీ.. పంపం : జకీర్ నాయక్ ను భారత్ కు అప్పగించం

zakirవివాదాస్పద ఇస్లామిక్‌ మత ప్రబోధకుడు జకీర్‌ నాయక్‌ ను భారత్‌ కు తిరిగి పంపించే ప్రశక్తే లేదన్నారు మలేషియా ప్రధాని మహథిర్ మహ్మద్. భారత్-మలేషియాల మధ్య ఉన్న అప్పగింత ఒప్పందం ప్రకారం.. జకీర్‌ ను భారత్‌ కు తిరిగి పంపిచాల్సిందిగా జనవరిలో(జూన్-5) భారత విదేశాంగశాఖ అధికారులు మలేషియా అధికారులను కోరారు.

శుక్రవారం (జులై-6) మలేషియా అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్ పుత్రజయలో న్యూస్ కాన్ఫరెన్స్ లో మాట్లుతున్న మలేషియా ప్రధానిని జకీర్ నాయక్ ను భారత్ కు అప్పగించే అంశపై రిపోర్టర్లు ప్రశ్నించగా….జకీర్ నాయక్ కు మలేషియాలో శాశ్వత నివాస హోదా ఉందని, జకీర్ ఎటువంటి ప్రాబ్లమ్ సృష్టించడంలేదని, ఆయన్ను భారత్ కు పంపించేది లేదని తేల్చి చెప్పారు. తన హేట్ స్పీచ్ లతో యువతను టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లో పాల్గొనేవిధంగా జకీర్ చేస్తున్నారన్న ఆరోపణలతో అతడిపై 2016 లో భారత్ లో కేసు నమోదైంది. దీంతో అతడు భారత్ ను వదిలిపెట్టి అతిపెద్ద ముస్లిం దేశమైన మలేషియాకు పారిపోయాడు. అప్పటినుంచి అతడిని భారత్ కు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అతడికి మలేషియాలో పర్మినెంట్ రెసిడెన్సీ ఉందని, ఆయన్ను భారత్ కు తిరిగిపంపించబోమని సాక్ష్యాత్తూ మలేషియా ప్రధానమంత్రే చెప్పడంతో ఇక జకీర్ ను భారత్ కు తీసుకురావడం సులభం కాదనే వార్తలు వినిపిస్తున్నాయి.

Posted in Uncategorized

Latest Updates