అయినా డిమాండ్ : ఈ నెంబర్ ధర వందల కోట్లు

F1numberplateఓ కారును కోట్లు పెట్టి కొంటేనే మనం నోరెళ్లబెడతాం… అలాంటిది ఓ నెంబర్ ప్లేట్‌కు ఏకంగా రూ.132 కోట్లు పెట్టి కొన్నారంటే నమ్ముతారా? కానీ ప్రపంచంలోనే అత్యంత డిమాండ్ ఉన్న F1 నెంబర్ ప్లేట్‌ను ఈ భారీ మొత్తానికి అమ్మకానికి పెట్టారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఈ F1 ప్లేట్‌ను ఇప్పుడు అధికారికంగా అమ్మకానికి ఉంచారు. ప్రైవేట్ ఓనర్‌షిప్‌లోకి వచ్చిన తర్వాత.. పదేళ్లలో ఎన్నో లగ్జరీ కార్లకు ఈ నెంబర్ ప్లేట్స్ వచ్చాయి. అందులో మెర్సిడీజ్-మెక్‌లారెన్ ఎస్‌ఎల్‌ఆర్, రేంజ్ రోవర్స్, బుగాటి వేరాన్‌లాంటి ఖరీదైన కార్లకు ఈ నెంబర్ ప్లేట్లు ఉన్నాయి.

యూకేలో ఈ F1 ప్లేట్లకు చాలా డిమాండ్ ఉంటుంది. కారు రేసుల్లో F1కి ఉన్న క్రేజ్ తెలిసిందే. అందుకే ఈ పేరుతో ఉన్న నెంబర్ ప్లేట్‌కు కూడా అదే రేంజ్‌లో డిమాండ్ ఉంది. దుబాయ్‌కు చెందిన భారత సంతతి వ్యక్తి బల్విందర్ సహానీ డీ5 ప్లేట్ కోసం రూ.67 కోట్లు వెచ్చించారు. ప్రస్తుతానికి రికార్డు ఇంకా ఆయన పేరిటే ఉంది. అబుదాబిలో నెంబర్ 1 ప్లేట్ 2008లో రూ.66 కోట్లకు అమ్ముడైంది.

మన దేశంలో ఇలా కస్టమైజ్డ్ నంబర్ ప్లేట్స్‌కు అనుమతి లేకపోయినా.. ఆర్టీవో నుంచి స్పెషల్ నెంబర్ ప్లేట్స్‌ను కొనుగోలు చేయొచ్చు. టూ వీలర్స్‌కైతే రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు, ఫోర్ వీలర్స్‌కైతే రూ.15 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చవుతుంది. ఒకే నంబర్ కోసం ఎక్కువ మంది పోటీ పడితే వేలం వేస్తారు. ఆ వేలంలో కూడా లక్షలు ఖర్చు పెడతారు.. అంతే కానీ కోట్ల మాట ఉండదు.

Posted in Uncategorized

Latest Updates