అయోధ్యలో రామ మందిరం నిర్మించాల్సిందే: మోహన్ భగవత్

అయోధ్యలో రామమందిరం తప్పక నిర్మించి తీరాలన్నారు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్. నాగ్ పూర్ లోని ఆరెస్సెస్ హెడ్ క్వార్టర్స్ లో జరిగిన విజయదశమి ఉత్సవ్ లో ఇవాళ మోహన్ భగవత్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ.. రాముడు మనందరికీ గర్వకారణం, అతడికి అంకితమిస్తూ ఓ మెమోరియల్ తప్పక ఉండాలి, అయోధ్యలో రామమందిరం సమాజంలో సామర్యం ప్రమోట్ చేస్తుంది అని అన్నారు. ఎలా అన్నది విషయం కాదు రామ మందిరం అయోధ్యలో తప్పక నిర్మించబడాలి అని భగవత్ అన్నారు. రామమందిర నిర్మానాన్ని వెంటనే చేపట్టాలని కొన్ని గ్రూపుల పూజారులు చేస్తున్న డిమాండ్ కు భగవత్ మద్దతు తెలిపారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించి మోడీ ప్రభుత్వం పార్లమెంట్ లో ఓ బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మందిర నిర్మాన విషయంలో ఎటువంటీ రాజకీయ జోక్యం లేనట్లయితే చాలా కాలం క్రితమే మందిర నిర్మాణం జరిగి ఉండేదని అన్నారు. శబరిమళ వివాదంపై కూడా ఆయన స్పందించారు. 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళలు అయ్యప్ప ఆలయంలోకి వెళ్లకూడదన్న సంప్రదాయం చాలా ఏళ్ల నుంచి ఉందని, అందరూ దాన్ని ఆచరిస్తున్నారని అన్నారు. దీనికి వ్యతిరేకంగా కోర్టులో పిటీషన్ వేసిన వాళ్లు మాత్రమే కాదు కదా టెంపుల్ కి వెళ్లేది, పెద్ద సంఖ్యలో మహిళలు సంప్రదాయాన్ని పాటిస్తున్నారు..వారి సెంటిమెంట్లను కోర్టు పరిగణలోకి తీసుకోలేదని ఆయన అన్నారు.

Posted in Uncategorized

Latest Updates