అయోధ్య కేసులో సుప్రీం కీలక తీర్పు

అయోధ్య కేసులో సుప్రీం కోర్టు గురువారం(సెప్టెంబర్-27) కీలక తీర్పునిచ్చింది. ఈ కేసు విచారణను ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి నివేదించేందుకు నిరాకరించింది. కేసు తదుపరి విచారణను అక్టోబర్ 29వ తేదీన జరుపుతామని తెలిపింది.

ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది. అయోధ్య భూమి వివాదాన్ని త్రిసభ్య ధర్మాసనం విచారిస్తుందని తెలిపింది. ఇస్లాంలో మసీదు తప్పనిసరి అంతర్భాగం కాదని సుప్రీం కోర్టు తెలిపింది. ప్రార్థనలు చేసుకునేందుకు ఎలాంటి మసీదు అవసరం లేదని 1994లో చెప్పిన తీర్పును సమర్థించింది..

ప్రార్థనా స్థలాలకు ఆయా మతాల్లో ప్రత్యేక స్థానముంటుందనీ… అన్ని మతాలు సమానమేనని తెలిపింది. 2-1తో తాజా తీర్పు ఇచ్చింది. అయోధ్య కేసును త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. మసీదులు ఇస్లాంలో అంతర్భాగమా కాదా అనే అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. దీనిని ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి బదలాయించేందుకు నిరాకరించింది. మసీదులు ఇస్లాంలో భాగం కాదని సుప్రీం కోర్టు 1994లో తీర్పు వెలువరించింది. దీనిని ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి ఇవ్వాల్సిన అవసరం లేదని జస్టిస్ దీపక్ మిస్రా, జస్టిస్ అశోక్ భూషణ్‌లు ఇవాళ తేల్చి చెప్పారు. ఇరువురి తరఫున తీర్పును జస్టిస్ అశోక్ భూషణ్ చదివారు. 1994 నాటి తీర్పుపై విచారణను ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి బదలాయించాలని జస్టిస్ నజీర్ అన్నారు.

Posted in Uncategorized

Latest Updates