అయోధ్య కేసు…తుది తీర్పుకి లైన్ క్లియర్ అయిందన్న స్వామి

అయోధ్య కేసులో సుప్రీం తీర్పుని స్వాగతించారు బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి. సుప్రీం తీర్పుతో బాబ్రీ మసీదు-రామజన్మభూమి భూ వివాదంపై తుది తీర్పుకు మార్గం సుగమమైందన్నరు.అయోధ్యలో రామ మందిర నిర్మాణం దీపావళికి ముందే ప్రారంభమవుతుందని తెలిపారు.

శ్రీరాముడు జన్మించినట్లు తన మతం చెబుతున్న చోట ప్రార్థన చేసుకునేందుకు తనకు ప్రాథమిక హక్కు ఉందన్నారు స్వామి . ఆ భూమిపై తమకు ఆస్తి హక్కు ఉన్నట్లు సున్నీ వక్ఫ్ బోర్డు చెప్తోందని ఆయన గుర్తు చేశారు. ఆస్తి హక్కు కన్నా….  ప్రార్థన చేసుకునేందుకు కల ప్రాథమిక హక్కుకు ఆధిక్యత ఉందన్నారు. ప్రార్థన చేసుకునే హక్కుదే పై చేయి అని స్వామి అన్నారు.

అయోధ్య రామ జన్మ భూమిలో ప్రార్థన చేసుకునే హక్కు కోసం తాను శుక్రవారం(సెప్టెంబర్-28) సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు స్వామి తెలిపారు. తన కేసును త్వరగా విచారణకు చేపట్టాలని కోర్టుని కోరుతానన్నారు. 1994 రూలింగ్‌ ను ముందుగా విచారణ జరిపేందుకు వీలుగా తన పిటిషన్‌ ను పెండింగ్‌ లో ఉంచారన్నారు.

Posted in Uncategorized

Latest Updates