అయ్యప్పను దర్శించుకున్న హిజ్రాలు

శబరిమల భక్తులతో కిటకిటలాడుతోంది. మండల పూజ సందర్భంగా అయ్యప్ప స్వామిని ప్రతిరోజూ వేలమంది దర్శించుకుంటున్నారు. అయ్యప్ప మాలలు వేసుకున్న స్వాములు.. ఇరుముడి సమర్పించి దీక్షలు విరమిస్తున్నారు. గుడి కట్టుబాట్లకు వ్యతిరేకం అంటూ స్వాములు, హిందూత్వ సంఘాలు ఆందోళన చేయడంతో.. మహిళలు అయ్యప్ప గుడికి వెళ్లడం లేదు. ఐతే… ట్రాన్స్ జెండర్స్ అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వస్తున్నారు. మాల ధరించిన కొందరు హిజ్రాలు .. మంగళవారం శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకుని.. దీక్ష విరమించారు. డిసెంబర్ 16న వీరు శబరిమలైకి వచ్చినప్పుడు .. స్వాములు వీరిని అడ్డుకున్నారు.  ప్రధాన పూజారితో చర్చల తర్వాత అయ్యప్ప దర్శనానికి అనుమతించారు.

మండల పూజలో భాగంగా నవంబర్ 16వ తేదీ నుంచి అయ్యప్ప ఆలయం తెరిచే ఉంది. డిసెంబర్ 27వ తేదీన గుడిని మూసివేస్తారు. మకరవిళక్కు పండుగ సందర్భంగా డిసెంబర్ 30న మళ్లీ గుడి తలుపులు తీస్తారు. జనవరి 20వ తేదీవరకు నిరాటంకంగా గుడిలో స్వామి దర్శనం కల్పిస్తారు. అయ్యప్ప గుడిలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు రావడంతో… ఆలయం వెలుపల గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ తీర్పుపై సమీక్ష చేయనుంది సుప్రీంకోర్టు.

 

Posted in Uncategorized

Latest Updates