అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం : రివ్యూ పిటిషన్ వేయబోమన్న పినరయి

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటీషన్ వేయబోయని సృష్టం చేశారు కేరళ సీఎం పిన్నరయి విజయన్. అంతేకాకుండా ఆలయంలోకి ప్రవేశించేందుకు మహిళా భక్తులకు భద్రత కూడా కల్పిస్తామని విజయన్ తెలిపారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు ఆలయ పరిసరాల్లో మహిళా పోలీసులను నియమించనున్నట్లు తెలిపారు. శబరిమలకు వెళ్లాలనుకుంటున్న మహిళలను ఎవ్వరూ అడ్డగించడానికి వీల్లేదన్నారు. సుప్రీం తీర్పుని కేరళ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. గవర్నమెంట్ కి కేవలం ఒకటే భాధ్యత ఉందని…అదే ఆర్డర్ ని అమలుపరచడం అని విజయన్ తెలిపారు.

శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి చిన్నారులు, వృద్ధ మహిళలే కాకుండా అందరు మహిళలనూ అనుమతించాలని సెప్టెంబర్-28న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సుప్రీం తీర్పుని కొన్ని వర్గాల వారు స్వాగతిస్తున్నప్పటికీ, కేరళ వ్యాప్తంగా పలు హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొంతమంది మహిళా గ్రూప్ లు కూడా సుప్రీం తీర్పుని వ్యతిరేకిస్తున్నాయి.

Posted in Uncategorized

Latest Updates