అయ్యప్ప భక్తులకు షాక్: ట్రైన్లో కర్పూరం వెలిగిస్తే కఠిన చర్యలు

అయ్యప్ప భక్తులకు మరోసారి రైల్వే శాఖ రూపంలో షాక్ ఇచ్చింది. శబరిమలకు వెళ్లే సమయంలో రైలులో ప్రయాణించే భక్తులు దీపం, హారతి కర్పూరం వెలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. దీనికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది.

అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే చాలామంది భక్తులు సాధారణంగా రైల్లోనే ప్రయాణం చేస్తుంటారు. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల నుంచి శబరిమల వెళ్లడానికి రైలు సౌకర్యముంది. అయితే వివిధ ప్రదేశాల నుంచి అక్కడకు చేరుకోవాలంటే దాదాపు 2,3 రోజుల సమయం పడుతుంది. దీంతో రైలులోనే పూజాదికార్యక్రమాలు నిర్వహిస్తుంటారు భక్తులు. బోగీల్లో పూజలు చేస్తూ కర్పూరం వెలిగిస్తుంటారు. అయితే అయ్యప్ప భక్తులు రైలు ప్రయాణాల్లో ఇలా చేస్తున్నారని రైల్వేశాఖకు ఫిర్యాదులు అందాయి. దీంతో రైళ్లల్లో నిప్పు వెలిగించడం నిషేధమని ప్రకటించింది రైల్వేశాఖ. ఎవరైనా అలా పట్టుబడితే వెయ్యి రూపాయల జరిమానాతో పాటు మూడేళ్ల జైలుశిక్ష పడే ఛాన్సుందని తెలిపింది.

ఇప్పటికే ..50 ఏళ్లలోపు మహిళలు స్వామివారి దర్శనం చేసుకోవచ్చనే సుప్రీంకోర్టు తీర్పుపై అయ్యప్ప భక్తులు మండిపడుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates