అయ్యప్ప స్వాములకు..ముస్లింల అన్నదానం

మంచి మని చేయడానికి మతం అడ్డంకి కాదని నిరూపిస్తున్నారు. హిందూ, ముస్లిం సోదరభావంతో మెలగాలనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు అనడానికి కొన్నిచోట్ల జరుగుతున్న మంచి కార్యక్రమాలే ఉదాహరణ.

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్వాములకు.. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ముస్లింలు. మానవులంతా ఒక్కటే … . మన దేవుడు ఒక్కడే అంటూ అయ్యప్ప స్వామి దేవాలయంలో బిక్ష ఏర్పాటు చేశారు. మతాల కంటే.. మనుషులంతా ఒక్కటే అని తెలిపేందుకే అన్నదానం ఏర్పాటు చేసినట్లు చెప్పారు ముస్లింలు. ఇటీవల నిజామాబాద్ లోనూ అయ్యప్ప స్వాములకు అన్నదానం చేశారు ముస్లింలు. పలుచోట్ల ఇలాంటి మంచి కార్యక్రమాలే కనిపిస్తుండటంతో సోషల్ మీడియాలో గుడ్ జాబ్ అంటూ కితాబిస్తున్నారు నెటిజన్లు.

Posted in Uncategorized

Latest Updates