అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు

తమిళనాడు: తిరుచ్చి దగ్గర్లో అయ్యప్పస్వాముల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లాకు  చెందిన సూర్యావతి(52) చనిపోయింది. మరో 30 మందికి గాయాలయ్యాయి. వీరంతా ఈనెల 2న యూ.కొత్తపల్లి మండలం వాకతిప్ప నుంచి శబరిమలకు బస్సులో బయల్దేరి వెళ్లారు. స్వామి దర్శనం తర్వాత తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులు కొత్తపల్లి, వాకతిప్ప గ్రామాలకు చెందినవారుగా గుర్తించారు.

Posted in Uncategorized

Latest Updates