అయ్యో.. అయ్యయ్యో : కేంద్ర మంత్రికీ తప్పని ఈవ్ టీజింగ్

anu-priyaఆమె కేంద్ర మంత్రి.. చుట్టూ భద్రత ఉంటుంది.. బయటకు వెళితే కాన్వాయ్ కూడా ఉంటుంది.. అయినా ఈవ్ టీజింగ్ తప్పలేదు.. పోకిరీల అల్లరిచేష్టలను స్వయంగా ఎస్పీకి కంప్లయింట్ చేయటంతో వారిని అరెస్ట్ చేశారు.. అవును నిజం.. కుటుంబ, ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ సహాయ కేంద్ర మంత్రిగా ఉన్న అనుప్రియ పటేల్ ను కొందరు పోకిరీలు వెంబడించి మరీ అల్లరి చేశారు. వివరాల్లోకి వెళితే..

జూన్ 12వ తేదీ ఉదయం అనుప్రియ పటేల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. సొంత నియోజకవర్గం మీర్జాపూర్ లో పర్యటిస్తున్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అక్కడి నుంచి వారణాసి బయలుదేరి వెళుతున్నారు. ముందు, వెనక కాన్వాయ్ కూడా ఉంది. ఇదే సమయంలో కేంద్రమంత్రి అనుప్రియ పటేల్ ప్రయాణిస్తున్న కారుకు పక్కన మరో కారు వచ్చింది. మంత్రి కారును ఓవర్ టేక్ చేస్తూ.. ఆ కారులోని కుర్రోళ్లు అసభ్యకరంగా ప్రవర్తించారు. మంత్రిని టార్గెట్ చేస్తూ చేతులతో సైగలు చేశారు.

మంత్రి భద్రత దృష్ట్యా కారు వేగాన్ని కూడా పెంచారు డ్రైవర్ అయినా.. ఆ పోకిరీలు వదల్లేదు. మరోసారి మంత్రి కారును ఓవర్ టేక్ చేస్తూ అల్లరి.. అల్లరి చేశారు. దీంతో ఆమె కారులో నుంచే వారణాసి ఎస్పీకి కంప్లయింట్ చేశారు. ఆ కారుకు నెంబర్ ప్లేట్ కూడా లేదు. దీంతో ఎంక్వయిరీ చేసి.. కారును సీజ్ చేశారు పోలీసులు. కారులోని ముగ్గురు కుర్రోళ్లను అరెస్ట్ చేశారు. మంత్రి కారు ముందు కాన్వాయ్ కూడా ఉంది. దారి మధ్యలో ఆపి.. వాళ్లను పట్టుకుందాం అని ప్రయత్నించినా వారు స్పీడ్ గా వెళ్లిపోయారని చెబుతున్నారు భద్రతా సిబ్బంది.

Posted in Uncategorized

Latest Updates