అయ్యో పాపం.. పెద్దాయన : స్వామి అగ్నివేశ్ ను పరిగెత్తించి కొట్టారు

సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేష్ పై దాడి జరిగింది. మంగళవారం (జూలై-17) జార్ఖండ్ లోని పకుర్ జిల్లాలో BJP యువ మోర్చా కార్యకర్తలు ఆయనపై దాడి చేశారు. పరిగెత్తించి మరీ కొట్టారు. నడి రోడ్డుపై ఓ పెద్దాయన, అందులో సామాజిక కార్యకర్త అనే ఇంగిత జ్ణానం లేని కొందరు బీజేపీ యువమోర్చా కార్యకర్తలు ఇష్టానుసారం వ్యవహరించారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను చుట్టుముట్టి.. తీవ్రంగా దాడి చేశారు.

నల్లజెండాలు చూపిస్తూ దూసుకొచ్చిన BJP యువమోర్చా కార్యకర్తలు ఆయనను కిందపడేసి మరీ కొట్టారు. ఆయన చొక్కా కూడా చిరిగిపోయింది. తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. స్థానికులు, పోలీసులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. స్వామి అగ్నివేష్ పై దాడికి కారణాలు కూడా చెబుతున్నారు.

స్వామి అగ్నివేష్.. క్రిస్టియన్ మిషనరీ సంస్థలతో చేతులు కలిపి.. జార్ఖండ్‌ లోని గిరిజనులను క్రిస్టియన్లుగా మారుస్తున్నారని ఆందోళనకారులు ఆరోపణ. దాడి జరిగిన అనంతరం స్వామి అగ్నివేష్  మాట్లాడుతూ.. తాను హింసకు వ్యతిరేకమని చెప్పారు. శాంతియుతంగా ఉండే వ్యక్తిని తాను అని.. దాడి ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని తెలిపారు స్వామి అగ్నివేష్. క్రిస్టియన్ మిషనరీలతో సంబంధాలపై మాత్రం నోరు విప్పలేదు.

Posted in Uncategorized

Latest Updates