అయ్యో పాపం : మావటిని గుడిలోనే తొక్కి చంపిన ఏనుగు

elephantతమిళనాడు తిరుచ్చిలోని మరియమ్మన్ ఆలయంలో ఓ ఏనుగు బీభత్సం చేసింది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆలయ ఆచారాల్లో భాగంగా.. గుడికి ఏనుగును తీసుకొచ్చారు. భక్తులు ప్రసాదాలు ఇస్తున్న సమయంలో.. ఏనుగు ఒక్కసారిగా అరుస్తూ అందరినీ హడలెత్తించింది. భక్తులంతా పరుగులు పెట్టారు. ఏనుగుపై ఉన్న మావటి గజేంద్రన్ కంట్రోల్ తప్పి.. కిందపడిపోయాడు. కోపంతో ఉన్న ఏనుగు.. మావటిని తొక్కి చంపేసింది. ఆలయ సిబ్బంది.. పోలీసులు, ఏనుగును కట్టేసి నియంత్రించారు. ఈ ఘటనలో 8మంది భక్తులకు గాయాలయ్యాయి.

రోజూ ఏనుగు సంరక్షణ చూసే మావటి.. అదే ఏనుగు దాడిలో చనిపోవటం భక్తులను కలిచివేసింది. కొన్నేళ్లుగా ఆ ఏనుగు ఆయన సంరక్షణలో ఉంది. కింద పడిన వెంటనే.. అతడిని తన కాళ్లతో తొక్కింది.. తొండంతో విసిరేసింది.. ఈ ఘటనతో అందరూ షాక్ అయ్యారు. కంట్రోల్ చేసే మావటి పరిస్థితి అలా ఉంటే.. మిగతా వారు వణికిపోయారు. అతన్ని రక్షించటానికి.. ఏనుగును కంట్రోల్ చేయటానికి సాహసించలేకపోయారు. దీంతో ఆయన గుడిలోనే చనిపోయాడు. ఆ తర్వాత కొందరు సిబ్బంది, అటవీశాఖ అధికారులు వచ్చి.. ఏనుగును అక్కడి నుంచి తరలించారు.

Posted in Uncategorized

Latest Updates