అరకు ఘటనలో ముగ్గురు మావోల పేర్లు ప్రకటించిన పోలీసులు

అరకు MLA కిడారి సర్వేశ్వరరావు,  మాజీ MLA సివేరి సోమ హత్యకు సంబంధించి ముగ్గురు మావోయిస్టుల పేర్లు ప్రకటించారు పోలీసులు. స్థానికుల నుంచి సేకరించిన సమాచారంతో ముగ్గురి పేర్లను విశాఖ పోలీసులు తెలిపారు. ఆదివారం జరిగిన దాడిలో అరుణ అలియాస్ చైతన్య.. స్వరూప అలియాస్ కామేశ్వరి.. జులుమూరి శ్రీనుబాబు అలియాస్ సునీల్‌ లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఏవోబిలో కూంబింగ్ ముమ్మరం చేశామని.. త్వరలోనే మిగిలిన వారిని గుర్తిస్తామంటున్నారు పోలీసులు.

అరుణ విశాఖ జిల్లా కరకపాలెం.. స్వరూప పశ్చిమగోదావరి జిల్లా భీమవరం.. శ్రీనుబాబు విశాఖ జిల్లా దబ్బపాలెం మండలం అడ్డతీగలకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.

Posted in Uncategorized

Latest Updates