అరచేతుల్లో ప్రాణాలు : బ్రిడ్జి దాటితేనే బడికి

దేశంలో పలు చోట్లు వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్ లోనూ వర్షాలు పడుతున్నాయి. దీంతో నవ్ సరి ఏరియాలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఇళ్లల్లోకి నీళ్లు చేరడంతో కనీసం వండుకొని తినలేని పరిస్థితి ఉందంటున్నారు జనం. ఇక వీధులు చెరువులను తలపిస్తున్నాయి. వాగులా ప్రవహిస్తుంటంతో జనం ఇళ్లల్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఉంది. రెండు రోజులు కంటిన్యూగా వర్షం పడుతున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే గుజరాత్ లో స్కూల్ కెళ్లేందుకు చిన్నారులు తిప్పలు పడుతున్నారు. క్రస్ట్ గేట్ల ద్వారా బ్రిడ్జి దాటితేనే బడికి వెళ్లాల్సి వస్తోంది. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రిడ్జి గేట్లు ఎక్కి, అవతలి గట్టుకు చేరుతున్నారు. చిన్నారులను పెద్దలు దగ్గరుండి అవతలి గట్టుకు తరలిస్తున్నారు. అయితే ఏమాత్రం అదుపుతప్పిన పిల్లలు వాగులో కొట్టుకుపోవాల్సిందే. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రభుత్వం వెంటనే స్కూల్స్ కి సెలవు ప్రకటించాలని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. సహాయక చర్యలు చేపట్టి రోడ్లను నిర్మించాలంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates