అరణ్యంలో కీచక పర్వం : బాలిక చేతులు, కాళ్లు కట్టేసి.. క్రూరంగా..

rape-attemptదారుణం కంటే మరో పదం ఉండదు ఈ ఘటన వింటే.. అవును అడవిలో ఓ బాలికపై.. ఐదుగురు యువకులు అత్యంత కిరాతకంగా చేసిన దాని ఇప్పుడు దేశంలో ప్రకంపనలు రేపుతోంది. అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. బాబాఖేద్ గ్రామం. అక్కడ నివాసం ఉండే.. ఓ బాలిక గంగాఘాట్ అటవీ ప్రాంతానికి వెళ్లింది. ఆ అమ్మాయిపై ఐదురుగు యువకులు అత్యాచారం చేశారు. చాలా కిరాతకంగా ప్రవర్తించారు. బాలిక చేతులను చెట్లకు కట్టేశారు. వివస్త్రను చేశారు. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. ఇదంతా వీడియో తీశారు. ఇందులో ముగ్గురు యువకులు ఉన్నారు. ఈ వీడియోను ఆ యువకులే సోషల్ మీడియా ద్వారా స్నేహితులకు పంపించారు. అలా ఇది వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సీరియస్ అయిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

ఈ ఘటనపై ఉత్తర ఉన్నావ్ ఎస్పీ అనూప్ సింగ్ స్పందించారు. ఈ ఘటనపై బాలిక కూడా ఫిర్యాదు చేయలేదని చెప్పారు. అయినా కూడా విచారణ చేస్తున్నాం అని వెల్లడించారు. ఇది చాలా సిగ్గుచేటు అన్నారు. వీడియో ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను నియమించినట్లు ప్రకటించారు. ఒక్కడు దొరికినా కేసు మొత్తం కొలిక్కి వస్తుందని.. ఈ కేసును స్వయంగా డీల్ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇప్పటికే బాధితురాలిని గుర్తించాం అని.. ఆమె చెప్పిన ఆధారాలు, యువకుల వివరాలు కూడా నమోదు చేశాం అన్నారు.

వీడియోలో ఆ యువకులు ప్రవర్తించిన తీరు చూస్తుంటే వారిలో క్రూరత్వం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది అంటున్నారు నెటిజన్లు. ఓ బాలిక అనే ఆలోచన కూడా లేకుండా.. చెట్లకు చేతులను కట్టేసి.. ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అని నిలదీస్తున్నారు. నిందితులకు వెంటనే కఠిన శిక్షలు పడితేనే.. మిగతా వారిలో భయం వస్తుందంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates