అరవింద్ ఉగ్రరూపం : వర్మ.. ఓ నీచ నికృష్టుడు

ALLU-ARVIND,-RAM-GOPAL-VERMAరాంగోపాల్ వర్మ వ్యవహారాన్ని ఎండగట్టారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. తల్లి లాంటి తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఎదిగి.. పాలు తాగి రొమ్ములు గుద్దే రకం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీలోనే కాకుండా వ్యక్తిగతంగానూ వర్మ ఓ నీచ, నికృష్ణుడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తిగా అభివర్ణించారు. పవన్ కల్యాణ్ ను తిట్టించింది నేనే అని వర్మ స్వయంగా ఒప్పుకున్నాడు అని.. శ్రీరెడ్డి ఈ విషయం బయటపెట్టక ముందే తానే ఈ విషయాన్ని వెల్లడించాడని చెప్పుకొచ్చారు. ఇలాంటి అతి తెలివిగాళ్లను 40 ఏళ్ల ఇండస్ట్రీలో ఎంతో మందిని చూశాననన్నారు. ఇలాంటి వెధవ తెలివితేటలు చూపిస్తున్నాడని ఎద్దేవ చేశారు అరవింద్. నీ బతుక్కు ఇంత అవసరమా అని నిలదీశారు. పవన్ పై ఉన్న కోపాన్ని శ్రీరెడ్డి ద్వారా ఇలా తీర్చుకున్నాడని.. మెగా ఫ్యామిలీపై ఎందుకంత కోపం అని ప్రశ్నించారు.

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి 5 కోట్ల రూపాయలు ఇప్పిస్తానని చెప్పావు.. వారు ఎవరూ కూడా అలాంటి ప్రతిపాదన చేయలేదన్నారు. ఆ విషయాన్ని స్వయంగా నేనే ఫోన్ చేసి తెలుసుకున్నట్లు చెప్పారు. మరి 5 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయని.. వర్మ వెనక మరొకరు ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రజారాజ్యం పార్టీ అప్పుడు కూడా ఇలాంటి కుట్రలే జరిగాయని.. ఆ అనుభవం, నాటి పీడ జ్ణాపకాలను తలచుకుంటేనే ఇప్పటికీ గుండె రగిలిపోతుందన్నారు. మళ్లీ అలాంటి కుట్రలపై పవన్ కల్యాణ్ పై జరుగుతున్నాయన్నారు.

శ్రీరెడ్డి ప్రస్తావించిన కాస్టింగ్ కౌచ్ పై సినీ ఇండస్ట్రీ సీరియస్ ఉందన్నారు. మంచి పని చేయబోతున్నామని వెల్లడించారు. క్యాష్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని.. అందులో 50 శాతం మంది మహిళలు, NGO సంఘాలు ఉంటాయన్నారు.

Posted in Uncategorized

Latest Updates