అరవింద సమేత ట్రైలర్: గొడవ రాకుండా ఆపుతాడు చూడు.. వాడే గొప్పోడు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్ యాక్ట్ చేసిన అరవింద సమేత మూవీ ట్రైలర్ ఇవాళ(అక్టోబర్.2) న రిలీజ్ అయ్యింది.  త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తోన్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు.  ట్రైలర్ లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి.

“మదిరప్పా.. ఇక్కడ మంది లేరా? కత్తులు లేవా?’ అన్న ఎన్టీఆర్‌  డైలాగ్ తో పాటు ‘30 ఏండ్లనాడు మీ తాత కత్తి పట్టినాడంటే అది అవసరం.. అదే కత్తి మీ నాయన ఎత్తినాడంటే అది వారసత్వం.. అదే కత్తి నువ్వు దూసినావంటే అది లక్షణం. ఆ కత్తి నీ బిడ్డనాటికి లోపం అయితందా’ అని ఎన్టీఆర్‌ బామ్మ చెప్పిన డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ మూవీలో పూజా హెగ్డే,ఇషా హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారు.  సినిమాను అక్టోబర్.11న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది .

Posted in Uncategorized

Latest Updates