అరవింద సమేత వీర రాఘవ రిలీజ్ డేట్ ఫిక్స్

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న అరవింద సమేత వీర రాఘవ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. రోజుకో సర్ ఫ్రైజ్ ఇస్తూ అభిమానులను ఖుషీ చేస్తోన్న మూవీ టీమ్…ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా ప్రకటించింది. దసరా కానుకగా భారీ అంచనాల నడుమ అక్టోబర్-11న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు….హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ట్వీట్ చేసింది. యంగ్ టైగర్ ఎన్‌ టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఈ దసరాకి సిద్ధంగా ఉండండి అంటూ ట్వీట్ చేసింది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. థమన్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు. ఈ మూవీలో పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌ పై ఈ మూవీ తెరకెక్కుతోంది.

Posted in Uncategorized

Latest Updates