అరుదైన ఆపరేషన్ : కడుపులో ఉన్న స్టీల్ గ్లాస్ బయటకు తీశారు

PHOTOఅరుదైన ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించారు ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లోని రామా హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్లు. ఓ వృద్దుడు కడుపులో ఉన్న స్టీల్ గ్లాస్ ను ఆపరేషన్ చేసి బయటకు తీశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఔరియా జిల్లాలోని దిబియాపూర్ కి చెందిన రామ్దిన్ అనే వృద్దుడిపై కొంతమంది గూండాలు దాడికి పాల్పడి అతడి దగ్గర ఉన్న డబ్బులను దోచుకున్నారు. అంతేకాకుండా కర్కశంగా ప్రవర్తించి ఆ వృద్దుడి కిందిభాగం నుంచి ఓ స్టీల్ గ్లాస్ ను కడుపులోకి తోశారు.

దీంతో తీవ్రమైన కడుపునొప్పితో ట్రీట్ మెంట్ కోసం జూన్-26 న కన్పూర్ లోని రామా హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ కు వెళ్లాడు. చెకప్ లు చేసిన డాక్టర్లు వృద్దుని కడుపులో స్టీల్ గా ఉన్నట్లు గుర్తించారు. దీంతో డాక్టర్ అమిత్, డాక్టర్ రోహిత్, డాక్టర్ అసీష్, డాక్టర్ రాజీవ్ కుమార్ లు గంటసేపు సుదీర్ఘ ఆపరేషన్ చేసి విజయవంతంగా వృద్దుని కడుపులోని స్టీల్ గ్లాస్ ని బయటకు తీశారు. అయితే చాలా కేసుల్లో మనిషి కడుపులో చిన్న చిన్న వస్తువులు ఉండటం చూశామని, అయితే రామ్దిన్ ది మాత్రం అరుదైన కేస్ అని డాక్టర్లు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates