అరుదైన గౌరవం : మేడమ్‌ టుస్సాడ్‌ లో కోహ్లీ

KOHLI2విరాట్‌ కోహ్లికి అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తూ ప్రపంచ ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందిన టీమిండియా కెప్టెన్‌ కోహ్లి మైనపు విగ్రహాన్ని ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ మేడమ్‌ టుస్సాడ్‌ మ్యూజియంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ గౌరవం పొందిన క్రీడా దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్‌, కపిల్‌ దేవ్‌, అర్జెంటీనా ఫుట్‌ బాల్‌ క్రీడాకారుడు లియోనెల్‌ మెస్సీ సరసన కోహ్లీ చేరాడు.
ఇప్పటికే లండన్‌ నుంచి వచ్చిన టుస్సాడ్‌ మ్యూజియం కళాకారులు కోహ్లీ కొలతలు తీసుకున్నారు.

మేడమ్‌ టుస్సాడ్‌ మ్యూజియంలో నా విగ్రహం ఏర్పాటు చేయడం అత్యంత గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు కోహ్లీ. ఓపికతో నా కొలతలు తీసుకుని.. నాకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతి ఇస్తున్న టుస్సాడ్‌ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.
ఇప్పటికే అర్జున అవార్డ్‌, ఐసీసీ వరల్డ్‌ క్రికెటర్‌, మూడు సార్లు బీసీసీఐ ఇంటర్నేషనల్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డులందుకున్న కోహ్లికి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురుస్కారంతో సత్కరించింది.

Posted in Uncategorized

Latest Updates