అరుదైన చిత్రం : టాప్ సినీ డైరెక్టర్స్ ఒకే చోట

Tollywood-Directersఇద్దరు హీరోలు కలిస్తేనే హడావిడి, హంగామా. ఇద్దరు హీరోయిన్స్ ముచ్చటించుకుంటే గుసగుస అంటూ రాసి పడేస్తుంటారు. అలాంటిది తొమ్మిది మంది టాప్ డైరెక్టర్స్ ఒకే చోట కలిస్తే.. ఒక ఫొటో దిగితే ఇంకెలా ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో అరుదైన చిత్రంగా మిగిలిపోతుంది. అలాంటిది ఇప్పుడు జరిగింది. జూన్ 4వ తేదీ సోమవారం రాత్రి డైరెక్టర్ వంశీ పైడిపల్లి తన పార్టీ ఇచ్చారు. ఆప్తులు అందర్నీ పిలిచారు. హీరోలు, హీరోయిన్స్, నిర్మాతలు ఎవరు వచ్చారో తెలియదు కానీ.. డైరెక్టర్స్ మాత్రం అందరూ అటెండ్ అయ్యారు. అందరూ కలిసి ఫొటో దిగారు. అద్భుతమైన వ్యక్తులతో మరిచిపోలేని సాయంత్రం గడిపాను అంటూ వంశీ పైడిపల్లి ట్విట్ తో ఈ చిత్రం బయటకు వచ్చింది.

పార్టీకి అటెండ్ అయిన దర్శకుల్లో బాహుబలి రాజమౌళి, భరత్ అనే నేను కొరటాల శివ, రంగస్థలం సుకుమార్, శాతకర్ణి క్రిష్, మహానటి నాగ్ అశ్విన్, గబ్బర్ సింగ్ హరీష్ శంకర్, అర్జున్ రెడ్డి సందీప్ వంగ, పటాస్ అనిల్ రావిపూడితో ఊపిరి వంశీ పైడిపల్లి ఫొటో దిగారు. తొమ్మిది మంది మెగా డైరెక్టర్స్ అందరూ ఒకే చోట.. ఒకే ఫ్రేమ్ లో కనిపించటంతో ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఆయా డైరెక్టర్స్ తీసిన సినిమాలను గుర్తు చేసుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాంటి ఇగోలను పక్కన పెట్టి.. దర్శకులు అందరూ కలవటం గుడ్ అంటున్నారు నెటిజన్స్. ఇలాంటి పార్టీలు హీరోలు, హీరోయిన్స్ కూడా చేసుకుంటే ఎంతో బాగుంటుందో అంటూ సూచిస్తున్నారు నెటిజన్స్.

Posted in Uncategorized

Latest Updates