అరుదైన దృశ్యం : ఒకేచోట 5వేల పక్షులు.. ప్రేమికుల క్యూ

జమ్మూ : సాయంకాలానా..పక్షుల కిలకిలలు. ఆకాశంలో కలిసికట్టుగా విహారించే పక్షుల జోడీలు కనిపిస్తే చూడకుండా ఉండగలమా. అలాంటిది ఒకేసారి 5వేలకు పైగా రకరకాల పక్షులు ఒకేచొట కనిపిస్తే. ఆ అరుదైన దృశ్యం ఇప్పుడు జమ్ములో కనిపిస్తోంది. శీతాకాలం కావడంతో వేలాది పక్షులు వాతావరణ మార్పులకు అనుగుణంగా తమకు అనువైన ప్రాంతాలకు చేరుకుంటున్నాయి.

జమ్మూ పరిధిలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న ఘరానా వెట్‌ లాండ్ (చిత్తడి నేల ప్రాంతం) కన్జర్వేషన్ రిజర్వుకు 5వేలకి పైగా పక్షులు చేరుకున్నాయి. ఘరానా వెట్‌ లాండ్ రిజర్వు పరిధిలో మక్వాల్, కుక్‌డియన్, అబ్దుల్లియన్, పార్గ్‌ వాల్ చిత్తడి నేలల ప్రాంతాలున్నాయి. పక్షి ప్రేమికుల కోసం ఈ ప్రాంతాలకు 170 రకాల జాతుల వలస పక్షులు..వీటిలో పెద్ద తల ఉండే బాతులు, గడ్వాల్ పక్షులు, సాధారణ అడవి బాతులు, ఊదా చిత్తడి కోళ్లు, భారత మూర్ కోళ్లు, తెల్లకొంగలు, ఇగ్రెట్స్, గ్రీన్ షాంక్స్ వంటి పక్షులు శీతాకాల సీజన్‌ లో ఇక్కడికి చేరుకున్నాయని తెలిపారు జమ్మూ వన్యసంరక్షణ విభాగం అధికారులు. ఈ సన్నివేశాన్ని చేడటానికి ప్రేమికులు క్యూ కడుతున్నారని తెలిపారు.

 

Posted in Uncategorized

Latest Updates