అరుదైన రికార్డుకు చేరువలో రైనా

RANIA RECORD KOHLIసిక్సర్ల వీరుడు సురేశ్ రైనా అరుదైన రికార్డు చేరువలో ఉన్నారు. IPL సీజన్-11లో భాగంగా మంగళవారం (మే-22) వాంఖడే వేదికగా హైదరాబాద్ తో చెన్నై ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో రైనా విధ్వసం సృష్టిస్తే మంచి రికార్డును బ్రేక్ చేయనున్నాడు.  దీంతో అందరి కళ్లు చెన్నై బ్యాట్స్‌ మన్ సురేశ్ రైనా పైనే ఉన్నాయి. బెంగళూరు టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డుకు రైనా చేరవలో ఉన్నాడు.

IPLలో అత్యధిక పరుగుల వీరుడిగా నిలవడానికి రైనా.. 17 పరుగుల దూరంలో ఉన్నాడు. కోహ్లి 4వేల 948 రన్స్ తో టాప్ ప్లేస్‌ లో ఉండగా.. రైనా 4 వేల 931 రన్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. బెంగళూరు టీమ్ IPL నుంచి బయటకు వెళ్లిపోవడంతో.. ఈ సీజన్ ముగిసేలోపు టాప్ స్కోరర్‌ గా రైనా నిలవడానికి మంచి అవకాశం ఉంది. రైనా IPLలో 174 మ్యాచ్‌ లు ఆడి.. ఒక సెంచరీ, 35 హాఫ్ సెంచరీలు చేశాడు. అటు కోహ్లి పేరిట 4 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ లిస్ట్‌ లో 4 వేల 493 పరుగులతో రోహిత్ శర్మ మూడోస్థానంలో ఉన్నాడు.

మంగళవారంతో..IPL చివరి వారంలోకి ఎంటరైంది. లీగ్ స్టేజ్‌ లో టాప్‌లో నిలిచిన సన్‌ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇవాళ తొలి క్వాలిఫయర్ జరగనుంది. ఈ మ్యాచ్‌ లో గెలిచిన టీమ్ నేరుగా ఫైనల్ చేరనుండగా.. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచే టీమ్‌ తో ఇవాళ్టి మ్యాచ్‌ లో ఓడిన టీమ్ తలపడుతుంది.

 

 

Posted in Uncategorized

Latest Updates