అరెస్ట్ చేయండి : హాంకాంగ్ లో నీరవ్ మోడీ

nirav
పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో రూ.13వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడి.. దేశం నుంచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ఆచూకీ లభించింది. ఆయన హాంకాంగ్ లో ఉన్నట్లు భారత్ గుర్తించింది. ఈ మేరకు ఆధారాలు కూడా సేకరించింది ఇండియా. ఈ విషయాన్ని హాంకాంగ్ దేశానికి తెలియజేస్తూ.. నీరవ్ మోడీని వెంటనే అరెస్ట్ చేయాలని భారత్ ఉన్నతాధికారులు కోరారు. భారత్ నుంచి పారిపోయిన తర్వాత లుక్ ఔట్ నోటీసులు జారీ చేసిన విషయాన్ని కూడా తెలియజేసింది.

నీరవ్ మోడీ, అతని మామ చౌక్సీపై ఏప్రిల్ 8వ తేదీ ఆదివారం (నిన్న) ముంబై సీబీఐ స్పెషల్ పకోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంజ్ జారీ చేసింది. ఈ ఆదేశాలు వచ్చిన 24 గంటల్లోనే నీరవ్ హాంకాంగ్ లో ఉన్నట్లు క్లారిటీకి వచ్చిన కేంద్ర హోంశాఖ.. PNB కుంభకోణంలో ఉన్న నీరవ్ మోడీని వెంటనే నిర్భంధంలోకి తీసుకోవాలని హాంకాంగ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు దేశాల మధ్య ఉన్న పరస్పర నేరగాళ్ల అప్పగింత ఒప్పందం, స్థానిక చట్టాలకు అనుగుణంగా నీరవ్ మోడీని అరెస్ట్ చేయొచ్చని చైనా అధికారులు అంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates