అర్చకత్వం ఉద్యోగం కాదు..వృత్తి మాత్రమే: స్వామి స్వరూపానంద

నిధులను మళ్లించడం కోసమే పట్టణాల్లో ఆలయాలను నిర్మిస్తున్నారని శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానంద ఆరోపించారు. ఇవాళ శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు చేరుకున్నఆయన…తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)పై తీవ్ర విమర్శలు చేశారు. గిరిజన, హరిజనవాడల్లో ఆస్పత్రుల నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అప్పుడే మతమార్పిడులు ఆగిపోతాయయన్నారు.

ముఖ్యంగా తిరుపతి దేవస్థానంలో అర్చకత్వం అంటే అది ప్రభుత్వ ఉద్యోగం కాదని… వంశపారంపర్య వృత్తి మాత్రమేనన్నారు. దీనికి రిటైర్మెంట్‌ ప్రకటించడం దారుణమన్నారు. TTD చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతారనే పీఠాధిపతుల సమావేశాలు నిర్వహించడం లేదని.. అర్చక వ్యవస్థను నాశనం చేసేందుకు ప్రభుత్వాలు యత్నిస్తున్నాయని విమర్శించారు. అర్చకులు, భక్తులకు సంబంధించిన విషయాల్లో ప్రభుత్వ జోక్యం తగదన్నారు. అర్చకుల మేలు కోసమే శారదాపీఠం పోరాడుతుందని స్పష్టం చేశారు స్వామి స్వరూపనంద.

Posted in Uncategorized

Latest Updates