అర్చకులకు ఏపీ సర్కార్ అన్యాయం : స్వరూపానంద

తిరుమల : అర్చకత్వాన్ని నాశనం చేసేందుకు టీటీడీ, ఏపీ సర్కార్ ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద. అర్చకత్వానికి రిటైర్ మెంట్ ఉండాలనే హక్కు టీటీడీ, దేవాదాయశాఖ కు లేదన్నారు. శారదాపీఠం సూచనలతోనే సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ వేశారని..సుప్రీం కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్నారు.

అర్చకుల తరఫున శారదా పీఠం పోరాడుతుందని చెప్పారు. మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయనకు..ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.

Posted in Uncategorized

Latest Updates