అర్థరాత్రి మహిళా సీఈఓపై ‘ఓలా’ క్యాబ్ డ్రైవర్ వేధింపులు

 రోజు రోజుకూ మహిళల భద్రత ప్రశ్నార్తకంగా మారుతుంది. కొందరు మహిళలు ఇంటి పోరుతో సతమతమవుతుండగా.. మరి కొందరు బయట సమాజంలో జరిగే అవమానాలను, శారీరక, మానసిక హింసలను ఎదుర్కొంటున్నారు. బెంగళూరు లో అర్ధరాత్రి  ఓలా క్యాబ్ డ్రైవర్ వేధింపులకు గురైంది ఆకాంక్ష. వీరు ఓ కంపెనీకి సీఈఓ గా పనిచేస్తున్నారు.  డిసెంబర్ 10వ తారీకు అర్ధరాత్రి..  బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంనుంచి నగరానికి ఆకాంక్ష ఓలా క్యాబ్ లో బయలుదేరింది. క్యాబ్ డ్రైవర్ రూట్‌ మ్యాప్‌ ఆధారంగా కాకుండా మరో మార్గంలో వెళ్లడానికి ప్రయత్నించాడు. దీంతో.. ఆకాంక్ష అభ్యంతరం తెలపగా అర్థరాత్రి.. నడీరోడ్డుపై కారు ఆపి దిగిపోండని డ్రైవర్ బెదిరించాడు. ఓలా హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయగా ఓలా సిబ్బంది ఆ డ్రైవర్ తో మాట్లాడారు. మిమ్మల్ని సురక్షితంగా గమ్యానికి చేరుస్తాడని, రూట్‌మ్యాప్‌ను తాము గమనిస్తుంటామని ఓలా సిబ్బంది ఆమెకు చెప్పడంతో ప్రయాణం కొనసాగించారు.

ఈ సారి క్యాబ్ డ్రైవర్ ఫోన్ లో మట్లాడుతూ.. డ్రైవింగ్ చేయగా ఆకాంక్ష అభ్యంతరం తెలిపింది. దీంతో డ్రైవర్ ఓ చీకటి ప్రదేశంలో కారు ఆపేశాడు. దీంతో భయానికి గురైన ఆమె మళ్లీ ఓలా హెల్ప్ లైన్ కు ప్రయత్నించగా అక్కడినుండి సమాధానం రాలేదు. దీంతో సిటీ పోలీసులకు ఫోన్‌ చేసి కారు నెంబరు తెలిపింది. తాను ఎక్కడ ఉన్నది సరిగ్గా చెప్పలేకపోవడంతో పోలీసులు ఫోన్ కట్ చేశారు. పోలీసులకు కంప్లైంట్ చేసి మూడు రోజులైనప్పటి నుండి ఇప్పటివరకు పోలీసులు గానీ ఓలా కంపెనీ కాని ఎలాంటి చర్యలు చేపట్టలేదని సోషల్ మీడియాలో ఆమె తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates