అర్ధరాత్రి కత్తులతో యువకుల హల్ చల్..అడ్డుకున్నవారిపై దాడి

హైదరాబాద్ : సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో దారుణం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి ఓ యువకుడిపై కత్తులతోదాడి చేశారు దుండగులు. తీవ్ర గాయాలైన వ్యక్తిని ఆస్పత్రిలో జాయిన్ చేశారు. బోయిన్ పల్లిలో అర్ధరాత్రి ఇద్దరు దుండగలు ఓ వ్యక్తిని చంపేందకు ప్రయత్నించారు. ఆ టైంలో అక్కడే ఉన్న ఓ బస్తీ యువకుడు వారిని అడ్డుకున్నాడు. దీంతో ఆగ్రహం చెందిన దుండగులు అడ్డుకున్న యువకున్ని కత్తితో దాడి చేసి పరారయ్యారు.

Posted in Uncategorized

Latest Updates