అర్ధరాత్రి హాస్పిటల్ కు కరుణానిధి .. క్షేమంగానే ఉన్నారన్న లీడర్స్

తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బ్లడ్ ప్రెషర్ తగ్గిపోవడంతో
శుక్రవారం (జూలై-27) అర్ధరాత్రి ఇంటి నుంచి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని స్టాలిన్, కనిమొళి ప్రకటించారు. చికిత్సరం ఆయన స్పందిస్తున్నారని డీఏంకే నేత రాజా తెలిపారు. బ్లడ్ ప్లజర్ ఆగిపోవటం వల్ల ఐసీయూలో ఉంచి ట్రిటెమెంట్ అందిస్తున్నామని కావేరి ఆస్పత్రి ప్రకటన విడుదల చేసింది. నిపుణులైన వైద్యబృందం ఆయన్ను పర్యవేక్షిస్తుందని ప్రకటించింది కావేరి ఆస్పత్రి. కరుణానిధి అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు.

కలైంజర్ కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆయన కోలుకుంటున్నారన్నారు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్. యూరిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారని… ఆయన కోలుకుంటున్నారని కరుణానిధి కూతురు కనిమొళి చెప్పారు. కరుణానిధిని పరామర్శించిన కుష్బూ … ఆయన ఆరోగ్య పరిస్థితిపై వదంతులు పుట్టించొద్దని విజ్ఞప్తి చేశారు. కలైంజర్ త్వరగా కోలుకోవాలన్నారు కేంద్రమంత్రులు. కరుణానిధిని అర్ధరాత్రి హాస్పిటల్ కు తరలించడంతో… ఆయన నివాసం ఉండే గోపాలాపురం సైలెంట్ గా మారింది.

డీఏంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం క్షీణించిందన్న ప్రచారంతో ఆయన్ని పరామర్శించేందుకు నేతలు, ప్రముఖులు నిన్న ఇంటి క్యూ కట్టారు. కలైంజర్ కోలుకోవాలని అభిమానులు పూజలు చేస్తున్నారు. కరుణానిధి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడి నిన్న ట్వీట్ చేశారు. డీఎంకే నేత, ఆయన కుమారుడు స్టాలిన్, కుమార్తె కనిమొళి, రాజా దగ్గరుండి కావేరి ఆస్పత్రిలో కరుణానిధిని జాయిన్ చేశారు. కరుణానిధి ఆరోగ్యపరిస్థితిపై ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు స్టాలిన్.

Posted in Uncategorized

Latest Updates