అలర్ట్ : కంప్యూటర్లపై కేంద్రం నిఘా

దేశంలో ప్రతీ ఒక్కరు వాడే కంప్యూటర్ల పై భారత ప్రభుత్వం మరింత నిఘా పెంచింది.  అనుమానం వస్తే చాలు.. పర్మిషన్ లేకుండానే కంప్యూటర్ల ను చెక్ చేయడానికి కేంద్ర హోం శాఖ దర్యాప్తు సంస్థలకు పర్మిషన్ ఇచ్చింది. ఇందుకు ఇంటెలిజెన్స్ బ్యూరోతో సహా 10 దర్యాప్తు సంస్థలకు అనుమతులు లభించాయి. ఈ విషయంలో కేంద్ర హోం శాఖ స్పందించింది. “కంప్యూటర్ లలో ఉన్న సమాచారంతో పాటు.. సెండ్ చేసిన, రిసీవ్ చేసుకున్న సమాచారంపై నిఘా ఉండనుంది. అవసరమైతే సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు అడ్డుకుంటాయని” హోంశాఖ తెలిపింది. ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ చ‌ట్టంలోని 69(1) సెక్ష‌న్ కింద ఈ ఆదేశాలు వ‌ర్తిస్తాయ‌ని చెప్పింది.

దర్యాప్తు చేసేవి ఇవే..
ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఈడీ‌, సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ డైర‌క్ట్ ట్యాక్సెస్‌, డైరెక్ట‌రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌, సీబీఐ‌, ఎన్ఐఏ, క్యాబినెట్ సెక్ర‌ట‌రియేట్‌, ఢిల్లీ పోలీస్, ఆర్ అండ్ ఏడ‌బ్ల్యూ, డైర‌క్ట‌రేట్ ఆఫ్ సిగ్న‌ల్ ఇంటెలిజెన్స్ తదితర సంస్థలు ఉన్నాయి. విచారణ ఎదుర్కొనే వారు  దర్యాప్తు సంస్థలకు అన్ని విధాల సహరించాల్సి ఉంటుంది. సహకరించకపోతే 7 సంవత్సరాల జైలుశిక్ష తో పాటు జరిమానాను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Posted in Uncategorized

Latest Updates