అలర్ట్: కేరళకు వరద ముప్పు

rainsదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యమంగా ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఇందులో భాగంగా కేరళకు వరద ముప్పు పొంచి ఉందని ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(SDMA) తెలిపింది. గురువారం ఆరు జిల్లాలైన కోజికోడ్‌, మలప్పురం, కన్నూర్‌, వేయానాడ్‌, పాలక్కడ్‌ రెడ్‌ అలర్ట్‌, మూడు జిల్లాలు ఇడుక్కి, కొట్టాయం, అలప్పుజా కు గురువారం(జూన్-14) ఆరెంజ్‌ అలర్ట్‌లను జారీ చేసింది. భారీ వరదల కారణంగా భూపాతాలు సంభవించే అవకాశం కూడా ఉన్నట్లు SDMA హెచ్చరించింది.

ఈ నెల 14 నుంచి 18 తేదీల మధ్య 7 నుంచి 24 సెం.మీల వర్షపాతం నమోదు అవుతుందని తెలిపింది. ఆయా ప్రాంతాల్లో జిల్లా విపత్తు నిర్వహణ సంస్థల సిబ్బందిని అలర్ట్‌ చేసినట్లు వివరించింది. కర్ణాటక, కేరళ, లక్షద్వీప్‌ తీరాల్లో జాలర్లను సముద్రంలోకి వేటకు వెళ్లరాదని సూచించింది. మహారాష్ట్ర, గోవా, గుజరాత్‌ తీరాలపై భారీ అలలు, పెనుగాలులు విరుచుకుపడనున్నాయి.

Posted in Uncategorized

Latest Updates