అలాంటి పనులకు నేను వ్యతిరేకం : డైరెక్టర్ కొరటాల

koratala-shivaకొన్ని రోజులుగా టాలీవుడ్ ను కుదిపేస్తున్న కాస్టింగ్ కౌచ్ అంశంలో సమాజ సేవ పేరుతో సినిమాలు తీసే స్టార్‌ డైరెక్టర్ లు కూడా ఉన్నారని నటి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు డైరక్టర్ కొరటాల శివ. కాస్టింగ్ కౌచ్ అంశంలో తన పేరు రావడం ఆశ్యర్యంగా ఉందని.. తాను ఎలాంటి వాడినో తన చుట్టూ ఉన్నావారికి తెలుసని అన్నారు. అలాంటి పనులకు వ్యతిరేకం అని.. అలాంటి మాటలు కూడా మాట్లాడను అన్నారు. నా చుట్టు పక్కన ఉన్న వాళ్లను కూడా అలాంటి విషయాలపై ప్రోత్సహించనని తెలిపారు. అసభ్యకరమైన వాఖ్యలతో కూడా ఎవరిని పిలవనన్నారు. ఆడ, మగ అనే తేడా తనకు లేదని.. అందరి పట్ల కృతజ్ఞతగా ఉంటానని డైరెక్టర్ కొరటాల శివ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates